ట్రంప్ నిర్ణయం.. భారతీయులపై ప్రభావం..

 

అమెరికా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే డొనాల్డ్ ట్రంప్ విదేశీయులు, అమెరికన్లు ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని.. నేను కనుక అధికారంలోకి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అందుకు తగ్గట్లే నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. లోవాలోని జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన విదేశీ ఉద్యోగులను తెచ్చి, అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోనని, అలా వచ్చే హెచ్-1బీ వీసా దారులను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. హెచ్-1బీ వీసాలతో వచ్చి అమెరికన్ల ఉద్యోగాలు ఆక్రమించేవారిని అనుమతించే ప్రసక్తే లేదని.. "ప్రతి అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు మనం పోరాడాల్సిన అవసరం ఉందని" తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ కనుక అలాంటి నిర్ణయమే తీసుకుంటే అది భారత ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.