ఇంతలోనే ఎంత మార్పు ట్రంప్...

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి అయిన హిల్లరీ క్లింటన్ పై, ఆమెకు మద్దతు తెలిపిన బరాక్ ఒబామాపై కూడా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిల్లరీ ఈ-మెయిల్స్ వ్యవహారంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రత్యేక న్యాయవాది ద్వారా హిల్లరీ ఈమెయిల్స్ అవినతి వ్యవహారాన్ని చూడాలని నా అటార్నీ జనరల్ ను ఆదేశిస్తానని..  జైలుకు పంపిస్తానని పలుమార్లు చెప్పారు. అయితే సడెన్ గా ట్రంప్ కు ఏం జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ మారిపోయినట్టు కనిపిస్తోంది. హిల్లరీని జైలుకు పంపే ఉద్దేశం లేదని, ఓటమితో కుంగిపోతున్న హిల్లరీ త్వరగా కోలుకునేందుకు ట్రంప్ సాయం చేస్తానని తెలిపారు. అంతేకాదు క్లింటన్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటే దేశంలో చాలా చీలికలు వస్తాయని నాకు అనిపిస్తుంది' అని కూడా అన్నారు.

 

ఇదిలా ఉండగా ఒబామాపై తెగ కామెంట్లు చేసి ఇప్పుడు ఆయనను ప్రశసించారు. అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా బరాక్ ఒబామా దిగిపోతారని అని నాడు అన్న ఆయన నేడు నాకు అధ్యక్షుడు ఒబామా అంటే చాలా ఇష్టం. ఆయన మంచి నాయకుడు అంటూ పొగిడారు. మరి ట్రంప్ లో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటో.. ఇంకా ఎన్ని విషయాలపై తన అభిప్రాయం మార్చుకుంటారో చూడాలి.