TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ కు చేదు అనుభవం.. కారు దగ్ధం

Published on: Sat Apr 30, 2016 12:56PM

 

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యాఖ్యలే ఆయనకు ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఒక్కోసారి మాత్రం అవి బెడిసికొడతాయి. తాజాగా ట్రంప్ కు అదే జరిగింది. కాలిఫోర్నియా ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లిన ట్రంప్ కు చేదు అనుభవం ఎదురైంది.  తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే లక్షలాది మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై మెక్సికన్ లు నిరసనలు చేపట్టి..  ఆయన ప్రచారం నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలో రోడ్లను దిగ్బంధించి ట్రాఫిక్‌ నిలిపేశారు. పోలీసుల కారును ధ్వంసం చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుచేసేందుకు పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు.