TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘డాలీ కీ డోలీ’లో ఇరగదీసిన సోనమ్ కపూర్

Published on: Fri Jan 23, 2015 5:24PM

 

అనిల్ కపూర్ ముద్దుల కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ సినిమా ‘డాలీ కీ డోలీ’ శుక్రవారం నాడు విడుదలైంది. అభిషేక్ డోగ్రా ఈ సినిమాకి దర్శకుడు. రాజ్‌కుమార్ రావ్, వరుణ్ శర్మ ఇతర ప్రధాన పాత్రధారులు. తాను నటించిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలను ధరించిన సోనమ్ కపూర్ ఈ సినిమాలో డాలీ అనే ఒక వైవిధ్యమైన పాత్రను ధరించింది. కుర్రాళ్ళను ప్రేమ పేరుతో, పెళ్ళి పేరుతో ముగ్గులోకి దించి చివరికి జెల్లకొట్టే కేరెక్టర్ ధరించింది. ఆమె మాయలో పడి మోసపోయిన యువకులుగా రాజ్‌కుమార్ రావ్, వరుణ్ శర్మ నటించారు. వీళ్ళిద్దర్నీ డాలీ మోసం చేసిన తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథాంశం. ఆశ్చర్యకరమైన క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. ట్విట్టర్లో ఎంతమాత్రం యాక్టివ్‌గా వుండని సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూసి తప్పకుండా చూడండంటూ రికమండ్ చేశాడంటే ఈ సినిమా ఎలా వుందో ఊహించుకోవచ్చు. డాలీ పాత్రలో సోనమ్ కపూర్ ఇరగదీసింది.