అరే.. ఇది అచ్చం రిచర్డ్‌లా వుందే..!
Published on: Thu Jul 14, 2022 3:33PM
మనిషిని పోలిన మనిషి వుంటాడు.. ఒకేలా వుండేవారు లోకంలో ఏడుగురు వుంటారట. వారిలో కనీసం ఒకరిద్దరూ ఏ క్షణానైనా ఎక్కడైనా ఎదురుపడవచ్చు. మనిషి పోలికతో వుండే జంతువులూ వుంటాయంటే నమ్ముతారా? ఇప్పుడు ఎంతో జుత్తు వున్న పెద్ద కుక్క అందరి దృష్టీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే అది అచ్చం ప్రముఖ కోటీశ్వరుడు రిచర్డ్ బ్రాన్సన్‌ని తలపిస్తోందిట!
దాన్ని చూడ్డానికి వస్తున్నవారు చాలామంది దాన్ని చెవులు, మూతిని పట్టుకుని లాగి మరీ చూస్తున్నారట. రిచర్డ్ కి ఈ సంగతి తెలుసా అని అనుకుంటున్నారు సరదాగా! రిచర్డ్ విర్జిన్ గ్రూప్ సిఇఓ. ఆయన అనేక రంగాలకు చెందిన 400 కంపెనీలను నిర్వహిస్తున్నారు.
రిచర్డ్ ఫోటోతోపాటు ఈ కుక్క ఫోటోను కలిపి చూస్తున్న జనం చాలామంది అచ్చం ఆయనలానే వుండ వచ్చు కానీ ఆయన మహా తెలివిగలవాడు, చక్కటి మనిషి. ఆయన్ను దీంతో పోల్చడం అన్యాయం అనీ నెట్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఏమైనప్పటికీ ఇలాంటి విచిత్రాలు సరదాగానే తీసుకోవాలి. అంతే తప్ప తాను ఎంతో అభిమానించే వ్యక్తిని అవమానిస్తున్నారని గొడవకి దిగకూడదు. మరి రిచర్డ్ అభిమా నులు ఈ ఫోటో చూసి ప్రశాంతంగా ఎలా నవ్వుకుంటారు?


