డి విటమిన్ లోపించిన వారిలోనే ఎక్కువగా

హైదరాబాద్ లో 70-80శాతం మందిలో లోపం

ఆధునిక జీవన శైలికి అలవాటు పడ్డ నగర జీవి ఎండ తగలకుండా నీడపట్టున పని చేస్తున్నాడు. రాత్రి పగలు తేడా తెలియకుండా, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలను గమనించకుండా యంత్రంలా తన పని తాను చేసుకు పోతున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎండ తగలకుండా ఏసీలో పని చేసే వాళ్ళకే కరోనా ఎక్కువగా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

డి విటమిన్ లోపం లేని వారు కరోనా బారిన పడినా త్వరగా కొరకు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రతి 100 మందిలో 70 నుంచి 80 మంది వరకు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. సాధారణంగా ఏదైనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు శరీరంలో ఉండే సైటోక్వీన్స్ వాటిని తరిమికొడతాయి. అయితే విటమిన్ డి లోపం ఉన్న వారిలో ఇవి తమ పనిని సమర్థవంతంగా చేయలేవు. అంతేకాదు ఎదురు దాడి చేసి శరీరంలోని ఇతర మూలకాలను దెబ్బ తీస్తున్నట్లు పరిశోధనల్లో స్పష్టమైంది. దాంతో రోగి ఊపిరితిత్తులు గుండె కాలేయం కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు విఫలం అవుతున్నాయి. ప్రాణాపాయ పరిస్థితికి ఇదే కారణం అవుతుంది. 

పోషకాలతో కూడిన ఆహారంతో పాటు తగినంత ఎండ శరీరానికి తగిలేలా దినచర్య ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.