Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాబోయ్ అమెరికాలో ఉద్యోగం వద్దు ... ఇంటి బాట పడుతున్న తెలుగు విద్యార్థులు
posted on: Jan 31, 2025 12:01PM
ఉన్నత చదువుల కోసం ఎఫ్ 1 విసాపై అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగులు చేస్తున్న తెలుగు విద్యార్థులు, యువకులు భయాందోళనకు లోనవుతున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ నినాదం ఇపుడు ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగువారిపై తీవ్ర ప్రభావం చూపింది. చదువు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు దాదాపు 7 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడు వేల విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ చట్టాలను పునరుద్దరించారు. రానున్న రోజుల్లో వీసా చట్టాలను మరింత కఠినతరం చేస్తామని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఒక వేళ ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుగు విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే. వీసాలు సాధారణంగా మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఎఫ్ 1, రెండోది జె 1, మూడోది ఎం 1 . ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా నియామకమైన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఆయన ఉక్కు పాదం మోపారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు ఉద్యోగం దేవుడెరుగు కనీసం ఇక్కడ ఉండనిస్తే చాలు అనే స్టేజికి వచ్చేశారు. తమను ఎక్కడ దేశబహిష్కరణకు గురి చేస్తారోనని వణికిపోతున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. రిస్క్ తీసుకుని స్టూడెంట్ వీసాలు తీసుకున్న వారంతా ఇంటి బాట పట్టే పరిస్థితి నెలకొంది. వీరంతా ఎఫ్ 1 వీసాపై ఉన్నవారే. వారానికి 20 గంటలు మించి పార్ట్ టైం ఉద్యోగం చేయకూడదు. నిర్దేశిత స్థలంలోనే ఈ ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే దేశ బహిష్కారం తప్పదు. రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్ లు, రిటైల్ స్టోర్ ల్లో అక్రమంగా పని చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరి పరిస్థితి దారుణంగా ఉంది.


.webp)



