డాక్టర్ సుధాకర్ సంచలన‌ లేఖ

విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్‌ లేఖ రాశారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చిందీ ఆ లేఖలో సుధాకర్‌ వివరంగా పేర్కొన్నారు. తనకు ఇస్తున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సుధాకర్ వాపోయారు. పెదవిపై వచ్చిన మార్పులను చూపిస్తూ తీసిన ఫొటోను లేఖకు జతచేశారు. యూరిన్‌ సమస్య కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు. తనను వెంటనే వేరే ఆసుపత్రికి రిఫర్‌ చేయాలని సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు.