TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డాక్టర్ సుధాకర్ లాగానే నన్ను వేధించారు.. కన్నీటి పర్యంతమైన దళిత మహిళా డాక్టర్

Published on: Mon Jun 8, 2020 1:45PM

వైజాగ్ లో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ విషయం లో ఎం జరిగిందో అందరికి తెలిసిందే. తాజాగా తిరుపతి లోని ఒక దళిత మహిళా డాక్టర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలుస్తోంది. దళిత మహిళనైన తనను వైసిపి నేతలు అసభ్య పదజాలం తో దూషించి వేధించారని ప్రభుత్వ మహిళా డాక్టర్ సంచలన ఆరోపణలు చేసారు. తిరుపతి కి చెందిన మహిళా వైద్యురాలు అనితారాణి ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో రెండు నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు అతి గతి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

ఇక అసలు విషయంలోకి వెళితే..
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు గా ఆమె పనిచేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం వచ్చినా.. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ఇక్కడే ఉద్యోగంలో చేరారు. ఐతే ఆమె పెనుమూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దిగువ స్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు తన పై కక్ష కట్టారని ఆమె పేర్కొన్నారు. గత మార్చ్ 22 జనతా కర్ఫ్యూ రోజు న కొంత మంది తాను ఉంటున్న హాస్టల్ లోనే తనను నిర్బంధించి స్థానిక వైసిపి నేతలను పిలిచారన్నారు. ఆ తరువాత తనను వారంతా కలిసి అనేక రకాలుగా దుర్భాషలాడుతూ, తనను వేధించారని ఈ సందర్బంగా బాత్ రూమ్ కు వెళ్లిన తన ఫోటోలు, వీడియోలు తీసి దారుణమైన వ్యాఖ్యలు చేసి మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. ఇదే విషయమై వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఐతే పోలీసులు మాత్రం కేసు ఫైల్ చేయకుండా ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్టేషన్ లోనే కూర్చో బెట్టారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో కేసు పెట్టవద్దని తన పై అధికారుల ద్వారా ఫోన్ లో వత్తిడి తెచ్చారని చెప్తూ ఆమె విలపించారు. తాజాగా ఆమె ఈ విషయం గురించి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫోన్ లో వివరించడం తో ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే ఇదే విషయమై ఆమె తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తోంది.