TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండి కుమారుడిపై పోక్సో కేసు.. బగీరథ్ తరఫున వాదించేదెవరో తెలుసా?

Published on: Wed May 13, 2026 9:38AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.  బండి కుమారుడిపై పోక్సో కేసు నమోదైందని తెలియగానే.. బీజేపీ ఆయనను పక్కన పెట్టేసింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ  ప్రధాని ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో ఆయన పేరును కనీసం ఆహ్వాన పత్రికలో కూడా ముద్రించలేదు. బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది.

 ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యం లేకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ కూడా బండి సంజయ్ విషయంలో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది.  బండి సైంజయ్ కుమారుడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతుగా నిలవడానికి సిద్ధంగా లేదు.

అయితే వైసీపీ మాత్రం అందుకు మినహాయింపుగా కనిపిస్తోంది.  తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ బండి బగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.   భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం (మే14)   వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఈ కేసులో బండి బగీరథ్ తరఫున  వైసీపీ ఎంపీ, సీనియిర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించనున్నారు.