TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Published on: Tue Aug 9, 2022 6:09PM

ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వక తప్పదు. తాజాగా ఆయన తన అస్తుల వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. ప్రధాని మోడీ పేరిట స్థిరాస్థులేవీ లేవు. ఆయన ఆస్తులన్నీ బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి.

ఆయన వెబ్ సైట్లో పొందుపరిచిన  వివరాల మేరకు మోడీ పేర ఉన్న మొత్తం ఆస్తుల విలువ 2.23 కోట్ల రూపాయలు. గాంధీనగర్ లో గతంలో మోడీ పేర కొంతభూమి ఉండేది.దానికి ఆయన దానం చేసి మరో ముగ్గురితో కలిసి యాజమాన్య హక్కలు పంచుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆ భూమికి యజమానిని కాదనీ, తన భాగాన్ని కూడా విరాళంగా ఇచ్చేశాననీ తెలిపారు.

ఇక మోడీ చేతి లో ఉన్న నగరదు 35వేల 250 రూపాయలు. ఇక పోస్టాఫీసులో తీసుకున్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ల విలువ  రూ.9,05,105లు, ఇంకా లక్షా 89 వేల రూపాయలు విలువ చేసు బీమా పాలసీ మోడీ పేరుపై ఉన్నాయి. ఇవి కాకుండా ఆయనకు లక్షా 73 వేల రూపాయలు విలువ చేసే నాలుగు ఉంగరాలు ఉన్నాయి. మోడీ వెబ్ సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆయన పేరు మీద ఎలాంటి వాహనం లేదు.