Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుంకీ ఏనుగుల ప్రత్యే‘కథ’ ఏమిటో తెలుసా?
posted on: May 21, 2025 2:52PM

ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు
రైతుల కష్టాలకు కుంకీలతో చెక్
ఇంతకీ ఏమిటీ కుంకీ ఏనుగుల ప్రత్యేకత!
మే 21న ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు రానున్నాయి. బెంగళూరులోని విధాన సౌధ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. డీసీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. గతేడాది ఆగస్టులో తమకు కుంకీ ఏనుగులు కావాలని కోరారు అటవీ శాఖా మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్. దీంతో సిద్ధరామయ్య సర్కార్ వీటిని ఏపీకి అందించడానికి సిద్ధమైంది. రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేసేందుకు ఈ కుంకీ ఏనుగులను వాడుతారు.
కుమ్కీ, కూమ్కీ, కూంకీ, కుంకి అని పిలుస్తారీ ఏనుగులను. మలయాళీలైతే.. తప్పాన అని కూడా పిలుస్తారు. భారత్ లో అడవీ ఏనుగులను బంధించడానికి ఆపరేషన్లలో ఉపయోగించే ట్రైనప్ అయిన ఏనుగులను ఈ ఈ పేర్లతో పిలుస్తారు. కొన్ని సార్లు గాయపడ్డ అడవి ఏనుగులను రక్షించడానికి, ఏదైనా ఉచ్చులో చిక్కిన అడవి ఏనుగులను రక్షించి.. వైద్య పరీక్షలు అందించడానికి కూడా ఈ ఏనుగులను ఉపయోగిస్తారు.
అడవి ఏనుగులను బంధించడానికి, శాంతింప చేయడానికి, మందను మేపడానికి, సంఘర్షణాత్మక పరిస్థితుల్లో అడవిలోంచి వచ్చిన ఏనుగులను తిరిగి అడవిలోకే పంపడానికీ..కుంకీ ఏనుగులను ఒక అంకుశంలా వాడుతారు. బేసిగ్గా ఏనుగును మావటి అంకుశం ద్వారా కంట్రోల్ చేస్తాడు. అవి మావటి దగ్గర శిక్షణ పొంది ఉంటాయి కాబట్టి అతడి అంకుశానికి అవి లోబడి ప్రవర్తిస్తాయి. అదే అడవి ఏనుగులు అలాక్కాదు. అవి ఎవరి మాట వినవు. ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు.. అలాంటి ఏనుగులను.. సాటి ఏనుగుతోనే కంట్రోల్ చేయడాన్నే కుంకీ ఏనుగు అంటారు.
వీటికంటూ ప్రత్యేక శిక్షణ ఉంటుంది. బేసిగ్గా భారతదేశంలో ఏనుగులను ఆలయాల్లో దైవ సేవల కార్యక్రమాలకే ఎక్కువగా వినియోగిస్తారు. తర్వాత సర్కస్ లో ఎక్కువగా వాడుతారు. కానీ కుంకీ ఏనుగుల రూటే సపరేటు. వీటిని సైనికుల్లా తీర్చి దిద్దాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎదుర్కోబోయేది మనుషులను కాదు సాటి ఏనుగులను. అసలే అడవి ఏనుగులు మదమెక్కి ఉంటాయి. ఆ గజబలాన్ని ఢీకొట్టాలంటే అందుకు తగిన విధంగా.. ఈ ఏనుగు సైతం అంతే ధీటుగా ఉండాలి. ఆ దిశగా వీటిని తీర్చిదిద్దుతారు.
అడవి ఏనుగులు జనావాసాల్లోకి, వారి పంట పొలాల్లోకి ప్రవేశించినపుడు.. వాటిని తరమికొట్టడానికి కుంకీలను వాడుతారు. అడవి ఏనుగులకు కుంకీ ఏనుగుకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేక పోయినా.. ఆ ఏగుల అరుపులతో కూడిన భాషను ఈ ఏనుగు ఇట్టే పసిగట్టి వాటికి తన మావటి ఇచ్చే హెచ్చరికలను జారీ చేసి.. పొలాల్లోకి రాకుండా చేస్తుంది. కొన్ని ఏనుగులు తమ మావటి నుంచి వచ్చే పాదాల ఆదేశాలను అనుసరించి.. మొత్తం ఆపరేషన్లో నిశ్శబ్ధంగానే ఉంటూ అడవి ఏనుగులను తరిమికొట్టేలా ట్రైనింగ్ ఇస్తారు..
కుంకీ అనే పదం పర్షియన్ భాషలోని కుమాక్ నుంచి వచ్చినట్టు చెబుతారు. దీనర్ధం సహాయం అని. బెంగాల్ నుంచి తమిళనాడు వరకూ ఈ పదాన్నే ఎక్కువగా వాడుతున్నారు. 2012లో తమిళంలో కుంకీ అనే సినిమా కూడా వచ్చింది. సాలోమన్ ప్రభు దర్శకత్వంలో.. విక్రం ప్రభు, లక్ష్మి మీనన్ హీరో హీరోయిన్లుగా.. తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. మొత్తం 70 కోట్ల మేర వసూలు చేసిన సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇపుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. ఈ మూవీగానీ మీరుచూడగలిగితే.. కుంకీ ఏనుగుల మీద పూర్తి అవగాహన కలుగుతుంది.



.webp)


