TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుపై నందమూరి కుటుంబం తిరుగుబాటు తప్పదా?

Published on: Sat May 26, 2012 10:41AM

తెలుగుదేశం పార్టీ మాది అని గర్వంగా చెప్పుకునే నందమూరి కుటుంబం మౌనముద్ర దాల్చింది. ఆ కుటుంబంలో ఎవరూ గొంతువిప్పి మాట్లాడటమే మానేశారు. వీరి మౌనం ఒక సంచలనానికి దారితీయవచ్చాన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. తెలుగుదేశం భావితరంనేతగా నారా లోకేష్ ను చంద్రబాబు తయారు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనూ ఈ కుటుంబం మాట్లడకపోవటం అటు అభిమానులను, ఇటు తెలుదేశం శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది.

 

 

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కూడా వల్లభనేని వంశీ వివాదం గురించి మాట్లాడేందుకు మాత్రమే తెరపైకి వచ్చారు. అప్పుడు కూడా తమ తాత నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని జూనియర్ స్పష్టం చేశారు. 1981లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఎన్టీఆర్ తన అల్లుడు కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడును పార్టీలోకి ఆహ్వానించారు. తనకు సహాయంగా ఆయన్ని తీసుకుని సుడిగాలి పర్యటనల ద్వారా కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మట్టికరిపించి మరీ అధికారంలోకి వచ్చారు. అయితే నాదెండ్ల భాస్కరరెడ్డి సిఎం కుర్చీ లాక్కుంటే ప్రజల్లోకి వెళ్ళి తిరిగి అధికారం దక్కించుకున్నారు.

 

 

మామను కాదని అధికారం చేజిక్కించుకున్న నారా చంద్రబాబునాయుడు తన అధికారాన్ని, పార్టీ అధినేతృత్వాన్నీ కొనసాగించారు. ఈ ప్రస్థానంలో నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు దాదాపుగా సహకరించింట్లే. అయినా సరే తమను గుర్తించకుండా తానే అన్నీ అయి పార్టీని నడుపుతున్న చంద్రబాబు తన తరువాత వారసునిగా నారా లోకేష్ ను పరిచయం చేయటం నందమూరి కుటుంబ సభ్యులకు మింగుడుపడటం లేదు. మేనల్లుడు కాబట్టి నందమూరి బాలకృష్ణ మౌనం వహించాడనుక్ముంటే మరి హరికృష్ణ ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ మాటేమిటి? వారూ మౌనంగానే సాహిస్తారా? లేక బయటకు వచ్చి తమదైన శైలిలో న్యాయం కోరతారా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు.

 

అయితే నందమూరి కుటుంబం మొత్తం చర్చల్లో మునిగి పోయిందన్నది విశ్వసనీయ సమాచారం. ఈసారి వదిలేస్తే పార్టీ నుంచే బయటకు వచ్చేసే పరిస్థితి తప్పదన్నట్టుగా అనిపించి కుటుంబమంతా ఏమిచేయగలం అన్న విషయమై సమాలోచనలు చేస్తున్నారట. అందుకే ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం నందమూరి కుటుంబం నుంచి ఎవరూ బయటికి రాలేదు. ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో బాలకృష్ణ పర్యతిస్తాడని చెప్పారు కానీ, ఆ కార్యక్రమం కూడా ఖరారు కాకపోవచ్చని అనుమానాలున్నాయి. ఏదేమైనా సరే! ఉప ఎన్నిక ప్రచారం పూర్తి చేసుకున్న తరువాత బాబు ముందు నందమూరి కుటుంబం తమ హక్కుల గురించి ప్రశ్నిస్తుందని తెలుస్తోంది. ఆ సమయంలో ఆవేశాలు పెరిగితే తెలుగుదేశం పార్టీలో సంచలనమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఈ కుటుంబంపై అభిమానంతో నడిచే క్యాడర్ కూడా బాబును నిలదీసే సమయం గురించే ఎదురుచూస్తోంది. దీంతో ఎప్పుడైనా సరే నందమూరి కుటుంబంలో రాజేకీయ వారసత్వం గురించి చర్చ తప్పదని తేలుతోంది. అదేప్పుదన్నది మాత్రం వేచి చూడాల్సిందే.