TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రంలో కానరాని డిఎన్‌ఎస్‌ ఛేంజర్‌ మాల్‌వేర్‌ ప్రభావం!

Published on: Mon Jul 9, 2012 7:30PM

dns changer malware, computer virus 9 july 2012, virus attack on computer, 9 july virus attack, dns malware attack on computers, dns changer malware effect, dns malware effect in apప్రపంచవ్యాప్తంగా సంచలనమైన ప్రకటన ఇది. డిఎన్‌ఎస్‌ ఛేంజర్‌ మాల్‌వేర్‌ ప్రభావం వల్ల మూడు లక్షల కంప్యూటర్లు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కోల్పోతాయని హెచ్చరిస్తూ వెబ్‌సెక్యూరిటీ సంస్థ మెకాషీ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రభావం వల్ల భారత్‌లోని 21,300కంప్యూటర్లు ఇంటర్నెట్‌కు దూరమవుతాయని పేర్కొంది. అమెరికాలో 69,500, ఇటలీలో 26,500 కంప్యూటర్లు కూడా ఇంటర్నెట్‌కు దూరమవుతాయంది.

భారత్‌లో 50వేల కంప్యూటర్లు డిఎన్‌ఎస్‌ ఛేంజర్‌ మాల్‌వేర్‌ బారిన పడ్డాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌టీం అథికారి తెలిపారు. అయితే ఈ ప్రకటన ప్రకారం ఇప్పటివరకూ ఆంథ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావమూ కనిపించలేదు. ప్రత్యేకించి తమ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఎలా కోల్పోయామని వెబ్‌ సెక్యూరిటీని ప్రశ్నించిన వారూ లేరు. అయితే రాష్ట్రంలో కొద్దిపాటి కంప్యూటర్‌ సంబంధమున్న ఏ ఇద్దరు కనిపించినా మాత్రం ఈ మాల్‌వేర్‌ ప్రభావం తమ సంస్థలపై ఎలా ఉంటుందో చర్చించారు. వీరి చర్చల్లో కూడా ఎక్కడా దీని ప్రభావం తమపై ఉంటుందని ఎవరూ పేర్కొనకపోవటం గమనార్హం. రాష్ట్రంలో ఈ మాల్‌వేర్‌ సోకి ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కోల్పోయిన సంస్థలు అతి తక్కువేనని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. దీనికి తగ్గట్లే ఎటువంటి ఫిర్యాదులు ఇంకా రాలేదు.