పన్నీర్ సెల్వంకి దారిచ్చిన స్టాలిన్...

posted on: Jan 28, 2017 12:01PM

 

తమిళనాడులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు దారిచ్చి ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతున్నారు. వివరాల ప్రకారం..ఈరోజు శాసనసభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను ప్రతిపక్షనేత స్టాలిన్‌ తన నివాసం నుంచి కారులో ప్రతిపక్షనేత స్టాలిన్‌ బయలుదేరారు.  ఆయన కారు వెంట సీఆర్‌పీఎఫ్‌ భద్రతా సిబ్బంది, శాసనసభ్యుల వాహనాలు కూడా వస్తున్నాయి. అయితే అదే సమయంలో ఆళ్వారుపేట దాటిన తర్వాత ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం కాన్వాయ్‌ రావటాన్ని స్టాలిన్‌ గుర్తించారు. వెంటనే తన వాహనాన్ని రోడ్డు పక్కన నిలపాల్సిందిగా డ్రైవరుకు సూచించారు. అలాగే భద్రతా సిబ్బంది, శాసనసభ్యులకు ఆ విషయాన్ని చేరవేశారు. దీంతో క్షణాల్లో వారి కార్లన్నీ రోడ్డు పక్కకు చేరుకుని నిలిచిపోయాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ఆ రోడ్డుపై వేగంగా దూసుకెళ్లిపోయింది. ఆ తర్వాత స్టాలిన్‌, శాసనసభ్యుల కార్లు అక్కడి నుంచి ముందుకు కదిలాయి. దీంతో ప్రతిపక్ష హోదాలో ఉన్న స్టాలిన్ ఇలా వ్యవహరించడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...