TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియాకు డీఎల్ రాజీనామా లేఖ..బుజ్జగింపులు

Published on: Thu Mar 22, 2012 12:35PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. తన రాజీనామా లేఖను ఆయన కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. ఉప ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. నాయకత్వ మార్పు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన రాజీనామా లేఖను పంపించారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆయన సోనియాకు ఆ లేఖను పంపించారు.

డిఎల్ రవీంద్రా రెడ్డిని బుజ్జగించేందుకు సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి తదితరులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తాను నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గేది లేదని రవీంద్రా రెడ్డి అంటున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలను ఎవరినీ సంప్రదించకుండా పెట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో అందరూ రాజీనామా చేయాలని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన బుధవారమే సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎల్ రవీంద్రా రెడ్డి పార్టీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మార్పునకు నాంది పలకాలని ఆయన అన్నారు.