డీఎల్ కు మోపిదేవి కౌంటర్..రాజకీయం చేయొద్దు
Published on: Fri Feb 10, 2012 1:20PM
హైదరా
బాద్: మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కామెంట్స్‌కు ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ కౌంటరిచ్చారు. తనకు మద్దతుగా మాట్లాడిన డీఎల్ కు కృతజ్ఞతలు చెబుతూనే మద్యం సిండికేట్ వ్యవహారంలో తననెవరూ బలిపశువును చేయలేదన్నారు. తనపై కుట్ర జరిగిందని భావించడం లేదని ఆయన అన్నారు. ఏసీబీ రిపోర్ట్‌కు రాజకీయాలు జోడించవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చేసే విమర్శలోకి తనను లాగవద్దని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బీసీలను అణగదొక్కుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న వెంకటరమణ, ఏసీబీ రిపోర్ట్ పై త్వరలోనే క్లారిటి వస్తుందన్నారు. నాపై విచారణకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని, దీన్ని రాజకీయం చేయొద్దని ఆయన అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన మంత్రిని కాపాడుకోవడానికి మోపిదేవిని ఉన్నతస్థాయి వ్యక్తి మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఇరికించారని ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


