TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ రాజకీయాల్లోకి భరతసింహరెడ్డి?

Published on: Sat Apr 14, 2012 5:21PM

రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డి.కే.అరుణ భర్త, మాజీ ఎమ్మెలే డి.కే. భరతసింహరెడ్డి మళ్ళి రాజకీయాల్లోకి చురుకుగా పాల్గొనాలని బావిస్తున్నట్లు తెలిసింది. భరతసింహారెడ్డి 1994లో గద్వాల్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. మంచి క్యాడర్ బలం ఉన్న బరతసింహరెడ్డి మెహబూబ్ నగర్ జిల్లా అంతటా విస్తృత సంబందాలు ఉన్నాయ్. వ్యాపార విషయాల్లో తలమునకలై ఉన్న భరతసింహరెడ్డి తన భార్య డి.కే.అరుణను రాజకీయాల్లోకి దింపారు. ఆమె కూడా రాజకీయాల్లోకి దింపారు. ఆమె కూడా రాజకీయాల్లోకి రాణిస్తూ మంత్రి పదివినీ కూడా పొందారు. ఇక్కడి దాకా బాగానే ఉన్నపటికీ మెహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ బలహీన పడింది. అందుకే మళ్ళి రాజకీయాల్లోకి దిగి వీలైతే పార్లమెంట్ సభ్యునిగా కూడా పోటి చేయాలనీ అయన భావిస్తున్నట్లు తెలిసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభస్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపీ విఠలరావు, టిఆర్ఎస్ నాయకుడు కేసిఆర్ పై ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి విఠలరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అందువల్ల ఈసారి తాను ఇక్కడ నుంచి పోటిచేయలనీ భరతసింహరెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తుంది.