రాష్ట్రపతి, ప్రధాని దీపావళి శుభాకాంక్షలు
Published on: Wed Nov 11, 2015 9:31AM

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో వుండాలని, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలని వారు తమ శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ తమ దీపావళి సందేశాలను ట్వీట్ చేశారు.


