TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌పై క్రిమినల్ కేసు

Published on: Wed Mar 1, 2017 9:08AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కృష్ణాజిల్లా నందిగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు, క్షతగాత్రులను పరామర్శించేందుకు జగన్ నందిగామ వెళ్లారు. ఆసుపత్రిలో వారిని పరామర్శించిన అనంతరం మృతుల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను లాక్కొనేందుకు ప్రయత్నించారు..దీనిపై అభ్యంతరం తెలిపిన జిల్లా కలెక్టర్‌ బాబుపై ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నందిగామ ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యుల విధుల ఆటంకం, దురుసు ప్రవర్తన ఆరోపణలపై ఫిర్యాదులో పేర్కొన్నారు.