ప్రభుత్వాన్ని పడగొట్టలేము - జేసీ

 

టీడీపీ కేంద్రంపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చి చర్చకు కూడా సిద్ధమవుతున్న సమయంలో ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం సమావేశాలకు హాజరు కాకపోవటం చర్చినీయాంసంగా మారింది. బుధవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజే తెదేపా ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వగా రేపు దీనిపై చర్చకు కూడా స్పీకర్‌ అంగీకరించారు. ఇటువంటి కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో, ఆ పార్టీలో ముఖ్యమైన నేతగా పేరున్న అనంతపురం పార్లమెంట్‌ సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి ఈ సమావేశాలకు గైర్హాజరయ్యారు.

రాజకీయ పరిస్థితులు బాగోక పోవడంతోనే తాను సమావేశాలకు హాజరు కావట్లేదని జేసీ తెలిపారు. మోడీ కి మెజారిటీ ఉంది, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టలేమని,కేవలం రాష్టానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశ ప్రజలకు తేలియజేయటానికే అవిశ్వాసం పెట్టామని,మోడీనే ప్రధాన మంత్రిగా కొనసాగుతారని అందుకే నేను వెళ్ళటం వల్ల వచ్చే లాభంగాని, వెళ్లకపోవటం వల్ల వచ్చే నష్టంగాని లేదని తెలిపారు. ఇప్పటికే ఆయనని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు టీడీపీ నేతలు.