TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైతే మంత్రి కొడాలి నాని!!

Published on: Sat Sep 5, 2020 6:04PM

ఏపీలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మంత్రి కొడాలి నాని స్టార్ట్ చేసిన ఈ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. నాని నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే దేవినేని ఉమా తో సహా మరికొంతమంది నేతలు స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా మంత్రి నాని వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు కొడాలి నాని పనితీరు కానీ, మాటలు కానీ ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. మంత్రి నానీని చూస్తుంటే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు ఉందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కరోనా ప్రభావం ఆయనకు తెలిసుంటే.. చంద్రబాబు వేషధారణ గురించి అలా మాట్లాడేవారు కాదన్నారు. ఎవరెన్ని అన్న చంద్రన్నది నిజంగా చంద్రమండలం స్థాయేనని కొడాలి నాని తెలుసుకోవాలని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

 

అసలు మాటిమాటికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడనే నాని, ఆరోజు జరిగిన పరిణామాలకు తనే స్క్రిప్ట్ రాశాడా?. స్వర్గీయ ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానీకి తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తండ్రి అయిన ఖర్జూర నాయుడి గారి కుటుంబం రౌడీయిజంతోను, ఫ్యాక్షనిజంతోను పైకి రాలేదని అన్నారు. అసలు చంద్రబాబు వయస్సు గురించి, చావుల గురించి మాట్లాడటానికి మంత్రి ఏమైనా యమధర్మరాజుకి శిష్యుడా?. ఇప్పటికైనా సరే, వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో సమానంగా ఎవరైనా పనిచేయగలరా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు గురించి ఒకసారి ఒక పేపర్‌లో చులకనగా రాశారని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును.. నాని లాంటి వాళ్లు ఎన్ని మాటలన్నా, ఆయన తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కదలదు. మంత్రిస్థాయిలో ఉండి లారీలతో గుద్దిస్తామనే ఆలోచనలు చేయడం బాధాకరం అని అంటూ.. లక్షకోట్ల అప్పులు తెచ్చి, ఏం చేశారో చెప్పకుండా, కేవలం ప్రశ్నించినవారిని చంపేస్తాం.. లేపేస్తాం అని బెదిరిస్తారా.. సీఎం జగన్ ప్రజలసొమ్ముని కోర్టు ఖర్చులకు దుబారా చేయకుండా, ఆ సొమ్ముతో తన సొంత పార్టీవారికి సభ్యత, సంస్కారాలు నేర్పితే మంచిది. ఇక మంత్రి నానినుద్దేశించి మాట్లాడుతూ.. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే, ఎక్కడో పెట్టుకున్నట్టు, మంత్రి పదవితో నాని ఏం చేస్తున్నాడో తెలియడం లేదు అని నానిపై దివ్యవాణి తీవ్ర విమర్శలు చేశారు.