దివిసీమ ఉప్పెనకు 36 ఏళ్లు

 

 

 

దివిసీమ ఉప్పెన.....ఈ పేరు వింటేనే కృష్ణాజిల్లాలోని దివిసీమ వాసులు ఉలిక్కిపడతారు. తీరప్రాంతాన్ని ఆనుకొని ఉండే దివిసీమ సముద్రుడి ఉగ్రరూపాన్ని చూసిన రోజు అది. దశాబ్ధాలు గడుస్తున్నా నవంబర్‌ 19 అంటేనే దీవిసీమ ప్రాంత వాసులు శ్రుతి పథంలో ఆనాటి జలప్రళయం సృష్టించిన విషాదం మెదులుతుంది. సంవత్సరాలు గడిచిన ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా తడారలేదు.

 

అప్పటి జలప్రళయంలో సొర్ల గొంది, దీన దయాళ పురం, దిండి, హంసల దీవి, నాళి..తదితర గ్రామాలలోని సుమారు పదివేల మందికి పైనే మృత్యువాత పడ్డారు. పంట నష్టం, పశు నష్టం, సంగతి చెప్పనక్కరలెదు. అంతెత్తున ఎగసిపడిన సముద్రపు అలలు సృష్టించిన అప్పటి ఆ భీభత్సాన్ని తలచుకుంటే దివిసీమ వాసులతో పాటు మనసున్న ప్రతి ఒక్కరి మనసు ఈనాటికి చెమర్చక మానదు.