ఎమ్మెల్యే కాలేరుకు తృటిలో తప్పిన ప్రమాదం
Published on: Fri Feb 17, 2023 12:59PM
అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. సీఎం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అంబర్ పేట్ నియోజకవర్గం లో సీఎం జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాల్చిన బాణా సంచా నుంచి వెలువడ్డ నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్లపై పడటంతో అవి పేలిపోయాయి.
దీంతో మంటలు రావటంతో ఎమ్మెల్యే, కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోడ్డుపై పడిపోయారు. అదృష్ణ వశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.


