టిటిడి రద్దు చేయాలని  కోరుతూ సుప్రీంలో పిటిషన్ కొట్టివేత 

తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేయాలని ఓ వ్యక్తి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల తిరుమలలో తొక్కిసలాట జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఈ కేసును సుప్రీం పర్యవేక్షణలో విచారణ జరపాలని రామచంద్రయాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తొక్కిసలాట కేసులో  బాధితులకు పరిహారం పెంచాలని పిటిషనర్ కోరారు.  తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అయితే జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ శుక్రవారం విచారించింది. ఈ పిటిషన్  కొట్టివేయడమే గాకుండా  అభ్యంతరాలు ఉంటే హైకోర్టునాశ్రయించాలని సూచించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu