ఫలితం నిరాశకలిగించిందన్న కేటీఆర్
Published on: Sun Dec 3, 2023 2:14PM
ఓటమిని అంగీకరించిన కేటీఆర్. రెండు సార్లు వరుసగా రాష్ట్రంలో అధికారాన్ని అప్పగించిన ప్రజలకు ఎక్స్ వేదిగా కృతజ్ణతలు తెలిపిన కేటీఆర్ ఈ సారి ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామన్నారు. ఈ ఫలితం నిరాశకలిగించిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ ను ఆయన అభినందించారు. ఓటమికి కారణాలపై ఆత్మ పరిశీలన చేసుకుంటామనీ, మళ్లీ ప్రజాభిమానాన్ని గెలుచుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


