డైరెక్టర్ కోడిరామకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం

 

సీనియర్ డైరెక్టర్ కోడిరామకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నట్టుండి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో జాయిన్ చేశారు.  ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు హాస్పటల్ కు క్యూ కడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కోడి రామకృష్ణ 1982 లో చిరంజీవి తో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమా చేసి డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. ఆ తరువాత 'అమ్మోరు, అరుంథతి, మంగమ్మగారి మనవడు, రిక్షావోడు, దేవుళ్ళు, దేవి, పెళ్లి, అంకుశం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు.