TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘అభినందన’ దర్శకుడి ఆరోగ్యం సీరియస్!

Published on: Tue Jun 10, 2014 4:30PM

 

 

‘అభినందన’, ‘నీరాజనం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్ తీవ్ర అస్వస్థతతో చెనై్నలోని ఎస్.ఆర్.ఎం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమించినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అశోక్ కుమార్ ను చికిత్స కోసం చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆయన కుమారుడు అకాశ్ అశోక్ కుమార్ తెలిపారు. అశోక్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీని అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్‌కు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు లభించింది. హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామాగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి.