హైకోర్టులోనూ చుక్కెదురు
posted on: Sep 29, 2013 6:56PM
.jpg)
డైరెక్టర్ జనరల్ ఆప్ పోలీస్ దినేష్ రెడ్డి చేసుకున్న అభ్యర్థనను హై కోర్టు తొసిపుచ్చింది. క్యాట్ తీర్పును సమర్ధించిన కోర్టు దినేష్ రెడ్డిని కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. దీంతో రేపటితో పదవీ కాలం ముగియనున్న దినేష్ రెడ్డి ఇక విధుల నుంచి వైదొలగక తప్పని పరిస్థితి.
పదవీ విరమణ వయసుతో సంభందం లేకుండా పదవి చేపట్టినప్పటి నుండి రెండేళ్ల పాటు సేవ చేయోచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని పొడిగించాలని దినేష్ రెడ్డి క్యాట్‌ను కోరారు. అయితే క్యాట్ ఆయన అభ్యర్ధనను తిరస్కరించడంతో దినేష్ రెడ్డి హై కోర్టు ను ఆశ్రయించారు. అయితే హై కోర్టు కూడా క్యాట్ తీర్పునే సమర్ధించింది.



.jpg)
.jpg)


