దిల్ రాజు కోరిక..కేటీఆర్ సిఫార్సు..జగన్ ఆమోదం!!
Published on: Sat Jun 22, 2019 2:49PM

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి శనివారం టీటీడి బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసారు. వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దిల్ రాజు కూడా పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుడైన దిల్ రాజు తన బ్యానర్ కు కూడా శ్రీవారి మీద భక్తితోనే "శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్" అని పేరు పెట్టుకున్నారు.
అయితే, దిల్ రాజును టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సిఫార్సు చేసినట్లు సమాచారం. కేటీఆర్ సూచనకు జగన్ వెంటనే అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే దిల్ రాజు చిరకాల కోరిక తీరినట్లే!!


