ఐటీ కార్యాలయంలో  దిల్ రాజు

posted on: Feb 4, 2025 9:37AM

సినీ నిర్మాత,  తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  మంగళవారం దిల్ రాజు హైద్రాబాద్ లోని ఐటీ కార్యాలయానికి చేరుకుని డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్ మెంట్లు ఐటీ అధికారులకు సమర్పించారు . సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఆయన  సినిమాల ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఐటీ అధికారులు దిల్ రాజుకు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది. దిల్ రాజుతో బాటు  టాలివుడ్ కు చెందిన కొందరు దర్శక నిర్మాతల ఇళ్లలో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. 

google-ad-img
    Related Sigment News
    • Loading...