TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిజెపి పార్టీ బుర్కాల ప్లాన్!

Published on: Wed Sep 25, 2013 4:33PM

 

Digvijaya Singh stokes up burqa row on BJP, BJP Digvijaya Singh, Digvijaya Singh burqa row

 

 

భారతీయ జనతా పార్టీ వెంట ముస్లిం మైనారిటీలు కూడా ఉన్నారని చాటుకునేందుకు ఆ పార్టీ ఓ పది వేల బుర్కాలను తయారు చేయిస్తోందని, ఆ బుర్కాలను తమ పార్టీ కార్యకర్తలకు వేయించి మైనారిటీలు బీజేపీతో ఉన్నారన్న భ్రమలు కల్పించే ప్రయత్నాలలో ఆ పార్టీ ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభలో ఈ ప్రయోగం చేయనున్నారని ఆయన ఆరోపించారు.


ఇందుకు సంబంధించి బీజేపీ బుర్కాలకు ఆర్ఢర్ ఇచ్చిందని ఓ బిల్లును దిగ్విజయ్ మీడియాకు చూపారు. అయితే గుజరాత్ లో 33 శాతం ముస్లింలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఇటీవల ఎన్నికల్లో తేలింది. ఇక ముస్లింలు మాత్రమే గెలుపు ఓటములు నిర్ణయించగల ఎనిమిది స్థానాలలో ఆరు స్థానాలు బీజేపీకి దక్కాయి. 2002 గుజరాత్ అల్లర్లను బూచిగా చూపడమే తప్ప నరేంద్ర మోడిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ కు ఎలాంటి కారణమూ దొరకడం లేదు.