TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దినేష్ పై దిగ్విజయ్ గరం గరం

Published on: Wed Oct 9, 2013 11:41AM

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై మాజీ డిజిపి దినేష్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దినేష్ రెడ్డికి నిజాయితీ ఉంటే డిజిపిగా ఉన్నప్పుడే ఈ విషయలను వెళ్లడిస్తే బాగుండేందని, పదవిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు పదవీ కాలాన్ని పొడిగించనందుకు కోపంతో ఇలా ఆరోపణలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు.దమ్ము, ధైర్యం ఉంటే కిరణ్ కుమార్ రెడ్డిపై కోర్టులో కేసు వేయాలని సవాల్ చేశారు.