Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ ను ప్రధాని చేసిన దిగ్విజయ్ సింగ్....
posted on: Mar 28, 2017 1:05PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తుంటారు అది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఆ ట్వీట్స్ లో కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ కూడా చేస్తుంటారు. అదీ అందరికీ తెలిసిన సంగతే. అయితే ఇప్పుడు ఏకంగా రాజీవ్ గాంధీ పేరు మార్చి ఎంత పెద్ద తప్పు చేశారో చూద్దాం. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజ్‌కుమారి రత్నసింగ్ నిర్మించిన ఓ వీడియోను దిగ్విజయ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ తరువాత రత్నసింగ్ గురించి చెబుతూ.. ‘రత్నసింగ్ రాజా దినేశ్ సింగ్ కుమార్తె. ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ కేబినెట్‌లో దినేశ్ మంత్రిగా పనిచేశారు’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. అంతే ఇంకేముంది డిగ్గీపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. రాహుల్ ఎవరో డిగ్గీరాజా మర్చిపోయినట్లున్నారు, రాహుల్‌ని ప్రధానమంత్రిని చేసేశారు అంటూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ తరువాత అసలు ఏం జరిగిందో తెలుసుకొని దిగ్విజయ్.. రాజీవ్‌గాంధీ కేబినెట్ అని సరిచేసి మళ్లీ ట్వీట్ చేశారు.
.jpg)


.jpg)
.jpg)


