TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ లవరు ముంచేసింది దేవుడో!

Published on: Tue Jul 15, 2014 3:26PM

 

మాజీ లవరు నిలువునా ముంచేసింది దేవుడో అని అతగాడు లబోదిబో అంటున్నాడు. ఇంతకీ అతనెవరో ఆషామాషీ వ్యక్తి కాదు. అర్జెంటీనా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు డిగో మారడోనా. సీజనుకో లవర్ని మార్చే ఈయనగారు ఆమధ్య రోకియో గెరాల్డైనా అనే ఫుట్‌బాల్ క్రీడాకారిణిని లవ్ చేశాడు. ఆమెని పెళ్ళి కూడా చేసుకోవాలని ఫిక్సయ్యాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందోగానీ ఇద్దరికీ చెడింది. ఆ అమ్మడు తన దారిన తాను వెళ్ళిపోయింది. అయితే సదరు మాజీ ప్రేయసి తనను నిలువునా దోచుకుందని మారడోనా దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన దగ్గర్నుంచి రోకియో కొట్టేసిన వస్తువుల జాబితా కూడా దుబాయ్ పోలీసులకు ఇచ్చాడు. దాంతో ఎలర్ట్ అయిపోయిన దుబాయి పోలీసులు రోకియో అరెస్టుకు వారెంటు కూడా జారీ చేసేశారు. ప్రస్తుతం మారడోనా దుబాయ్ స్పో్ర్ట్స్ కౌన్సిల్‌కి గ్లోబల్అంబాసిడర్ కూడా కావడంతో పోలీసులు చాలా చురుకుగా రోకియో కోసం వెతుకుతున్నారు. రోకియో భామని పట్టుకోవడానికి దుబాయ్ పోలీసులు ఇంటర్‌పోల్ సహాయం కూడా తీసుకుంటారట.