TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు!

Published on: Sun Nov 6, 2022 2:26PM

మోడీ విశాఖపర్యటన బీజేపీలో విభేదాలను బయటపెట్టింది. సోము వీర్రాజుపై పార్టీ సీనియర్లలో ఉన్న అసంత‌ృప్తి భగ్గుమంది. వైసీపీ మోడీ రాష్ట్ర పర్యటనను  హైజాక్ చేస్తే ఏం చేస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజుపై మాటల దాడి చేశారు. పార్టీ నేతలకు కనీస సమాచారం లేకండా వైసీపీ ప్రధాని కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా చేస్తున్నదనీ, మీరేం చేస్తున్నారనీ విమర్శలతో సోముపై విరుచుకుపడ్డారు.

బీజేపీ ప్రమేయం  లేకుండా ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా సమీక్షిస్తారంటూ సోము వీర్రాజును పార్టీ సీనియర్లు నిలదీశారు. ఈ సీన్ కు బీజేపీ కోర్ కమిటీ సమావేశం వేదికైంది. సీనియర్ల విమర్శలకు ఆగ్రహించిన సోము వీర్రాజు వారిపై ఎదురుదాడికి దిగారు.    

ఎవరి బతుకులేమిటో నాకు తెలుసంటూ విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ కోర్ కమిటీ సమావేశం రసాబాసగా మారిపోయింది. సోము వీర్రాజు, సీనియర్ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఈ దశలో కేంద్ర మంత్రి, పార్టీ ఏపీ ఇన్ చార్జి మురళీధరన్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అదే సమయంలో అందరినీ కలుపుకుని పోవాలని సోము వీర్రాజుకు హితవు చెప్పారు. ఈ నెల11న ప్రధాని మోడీ విశాఖకు పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే.

మోడీ పర్యటనపై చర్చించేందుకు జరిగిన కోర్ కమిటీ భేటీలో  ప్రధాని కార్యక్రమం గురించి ముందుగా తెలియాల్సింది వైసీపీకా? బీజేపీకా అని ఏపీ బీజేపీ సీనియర్లు సోము వీర్రాజును ప్రశ్నించారు. దీంతో సీనియర్లు, సోము వీర్రాజు మధ్య వాగ్వాదం జరిగింది.