మస్కట్ నుంచి వస్తూ గుండెపోటుతో బస్సులో మృతి
Published on: Wed Aug 28, 2024 4:42PM
తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా సత్య పద్మ ఈ నెల 24న మస్కట్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. తణుకు బస్సు ఎక్కింది. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బస్సులో గుండెపోటుకు గురైంది. దాంతో కూర్చున్న సీటులోనే అసువులు బాసింది. ఆర్థిక ఇబ్బందులను అధి గమించడానికి ఆమె మస్కట్ వెళ్లింది. అక్కడ యజమాని వేధింపులు తట్టుకోలేక స్వగ్రామానికి బయలుదేరాలని నిర్ణయించుకుంది. మస్కట్ నుంచి హైద్రాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆమె తిరిగి తణుకు బయలు దేరడానికి బస్సు ఎక్కింది. అప్పటికే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న ఆమె బస్సు సీటులోనే గుండెపోటుకు గురై చనిపోయారు. వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్.. సత్య పద్మ భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు


