తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగబట్టాడా?
Published on: Fri Oct 31, 2025 10:43AM
.webp)
తెలుగు రాష్ట్రాలపై వర్షాలు పగబట్టాయా అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే.. మొన్న ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటిన పెను తుపాను మొంథా ప్రభావం ఇంకా కొనసాగుతుండగానే బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెల 4 నాటికి అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాలకు మరో సారి భారీ నుంచి అతి భారీ వర్షాల బెడద తప్పదని పేర్కొంది. అదలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో మొంథా తుపాను ప్రభావంతో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మారు భారీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికతో జనం బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడింది. తీర ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


