TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక్క జోకు విలువ 33 ప్రాణాలు.!!

Published on: Tue Jul 31, 2018 5:48PM

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు అని చదువుతాం కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగు చేస్తూనే ఉంటాం.. సెల్ ఫోన్ మాట్లాడుతూనో లేక పక్కన వారితో మాట్లాడుతూనో డ్రైవింగ్ చేయడం కామన్ అయిపోయింది.. కానీ ఆ చిన్నపొరపాటే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.. బస్సులోని ప్రయాణికుల్లో ఒకరు జోక్ వేయడంతో అందరూ నవ్వారు.. ఆ నవ్వు విని డ్రైవర్ వెనక్కి తిరిగాడు ఇంకేముంది 33 మంది ప్రాణాలు కోల్పోయారు.

 


మహారాష్ట్రలో సతారా జిల్లాలో విహారయాత్ర నిమిత్తం సుమారు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.. ఈ దుర్ఘటనలో 33 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.. మొదట్లో ఈ బస్సు వేరే వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి లోయలో పడింది అనుకున్నారంతా.. కానీ ఆ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన ప్రకాశ్‌ సావంత్‌ అనే వ్యక్తి ఈ ప్రమాదానికి కారణం ఒక జోక్ అని చెప్పడంతో అందరూ అవాక్కు అయ్యారు.. ప్రకాశ్‌ మీడియాతో మాట్లాడుతూ..  ‘నేను డ్రైవర్‌ క్యాబిన్‌ వద్ద కూర్చున్నాను.. మిగతా ప్రయాణికులు గట్టిగా నవ్వుకుంటుండడంతో డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు.. అదే సమయంలో బస్సు అదుపు తప్పింది.. లోయలో పడబోతుండగా ముందుండే అద్దం ఊడిపోయింది.. దాంతో అప్రమత్తమై నేను దూకేశాను.. పడిపోకుండా చెట్టు కొమ్మను పట్టుకున్నాను.. ఆ లోపే బస్సు బండరాయిని తాకి.. ఆ తర్వాత 15 అడుగుల లోతులో ఉన్న చెట్టును ఢీకొని పూర్తిగా కిందపడిపోయింది' అని చెప్పాడు.. చూసారా డ్రైవర్ కొన్ని క్షణాల నిర్లక్ష్యం ఖరీదు ఎన్ని ప్రాణాలో.. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి అంతా డ్రైవింగ్ మీదనే ఉండాలి.. అలానే ప్రయాణికులు కూడా డ్రైవర్ దృష్టిని మరల్చకూడదు.