అమ్మవారి కిరీటంలోని వజ్రం మాయం
Published on: Mon May 6, 2019 2:09PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలోని వజ్రం మాయమైంది. గత కొన్ని రోజులుగా అమ్మవారి కిరీటంలోని వజ్రం కనిపించడం లేదు. వజ్రం అదృశ్యం కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అమ్మవారికి పూజలు చేసే క్రమంలో వజ్రం పడిపోయుంటుందని అధికారులు, అర్చకులు చెబుతున్నారు. మరోవైపు ఈ విషయాన్ని ఇన్నిరోజులు గోప్యంగా ఉంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2006లో ఓ భక్తుడు అమ్మవారికి కానుకగా సమర్పించిన బంగారు కిరీటానికి వజ్రాలను పొదిగించారు. అయితే, ఇప్పుడు వాటిలో ఓ వజ్రం మాయం కావడంపై అనుమానులు వ్యక్తమవుతున్నాయి. రోజు వారీ అభిషేకం చేస్తున్న సమయంలో ఎక్కడో వజ్రం పోయిందంటూ సమాధానం ఇస్తున్న అధికారులు.. తిథి, నక్షత్రం చూసి మళ్లీ ఆ వజ్రాన్ని అమరుస్తామని చెబుతున్నారు. మరి ఆ వజ్రం నిజంగానే పూజ సమయంలోనే పడిపోయిందా? అధికారులు తిరిగి అదే వజ్రాన్ని అమరుస్తారా? చూడాలి.


