ధూళిపాళ్ల కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొన్న సీఎంలు చంద్రబాబు, రేవంత్
Published on: Wed Mar 25, 2026 3:23PM
.webp)
గుంటూరు జిల్లా టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకలోకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. గుంటూరులోని శ్రీకన్వెన్షన్‌లో నాగసాయి వైదీప్తి- కెవిన్ రామ్ పెళ్లి బుధవారం జరిగింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో పాటు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. అనంతరం నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, సంధ్యారాణి, సవిత, పలువురు ఎమ్మెల్యేలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
.webp)


