శింగరకొండలో ధర్మవరపు అంత్యక్రియలు
Published on: Mon Dec 9, 2013 3:36PM

ప్రముఖ హాస్యనటుడిగా, రచయితగా, దర్శకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన గత ఏడాది కాలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదులో చైతన్యపురి వద్ద గల గీతా ఆసుపత్రిలో నిన్న రాత్రి పది గంటలకు ఆయన మృతి చెందారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని శింగరకొండకు ఆదివారం తరలించారు. సోమవారం ప్రకాశం జిల్లా శింగరకొండలోని ధర్మవరపు ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరిగినట్లు తెలిసింది.


