ధర్మాన కృష్ణదాస్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?
Published on: Tue Mar 13, 2012 1:11PM
శ్రీకా
కుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటి చేయబోతున్న తాజా మాజీ శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ ఇటీవల చేసిన కొన్ని ప్రకటనలు జిల్లాలో సంచలనం కలిగించాయి .ఈయన సోదరుడు ధర్మాన ప్రసాద్ పై కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు .కృష్ణదాస్ ప్రకటనలు కటువుగా ఉండటం ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ,అటు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
తనను నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని, తన ప్రాణాలు దారపోసి అయినా వారిని రక్షించుకుంటానని కృష్ణదాస్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను ఓడించడానికి, తన కార్యకర్తలను భయబ్రాంతులను చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సొంత కుటుంబం సభ్యులతో పోటీచేయడానికి సైతం తను తాను వెనుకాడబోనని కృష్ణదాస్ అంటున్నారు. నిజానికి కృష్ణదాస్ అనుచరులను ఎవరినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించడం లేదు. కృష్ణదాస్ తమ్ముడు ధర్మాన ప్రసాద్ కూడా తన సోదరుడిని కాని, ఆయన అనుచరులను గాని పల్లేత్తు మాట కూడా అనడం లేదు, అయినా ఏదో జరిగిపోతోందంటూ కృష్ణదాస్ ప్రకటనలు చేయడంవల్ల జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


