TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ధరణి .. టిఆర్ ఎస్ అన‌ర్ఘం..ప్ర‌జ‌ల‌కు త‌ల‌భారం

Published on: Fri Jul 8, 2022 4:23PM

సంస్క‌ర‌ణ‌లు ప్ర‌జాహిత‌మైన‌విగా వుండాలి. ఏదో త‌మ పేరు ప్ర‌తిష్ట‌ల‌కోసం గొప్ప సంస్క‌ర‌ణ చేప‌ట్టామ‌ని భ‌జ‌న చేయించుకుంటే ఆన‌క ప్ర‌జ‌ల నుంచీ వ‌చ్చే తిర‌స్కారాలు, చీవాట్ల‌ను కూడా ప్ర‌భుత్వం ఎదుర్కొన డానికి సిద్ధ‌ప‌డాలి. కానీ తెలంగాణా ప్రభుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో ఇపుడు నానా ఇబ్బందులు ఎద‌ర్కొంటోం ది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఆరంభించిన‌పుడు దాని వ‌ల్ల రెవిన్యూ స‌మస్య‌లు చాలామటుకు ప‌రిష్కారం అవుతాయ ని న‌మ్మ‌కంగా ప్ర‌చారం చేసేరు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆరంభించిన ధ‌ర‌ణితో ఆదిలోనే స‌మ‌స్య‌లు తెచ్చింది. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌క‌పోగా భూవివాదాలు రెండింత‌లు చేశాయి. ఇలా వివాదాల‌కు కేంద్రం గా మారిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ర‌ద్దు చేయాల‌ని తెలంగాణా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశా రు.

విడ్డూర‌మేమంటే, ధ‌ర‌ణి లో ల‌క్ష్మాపూర్ గ్రామంలోని చాలా భూముల వివరాలు లేనేలేవని ప్రభుత్వ మే భూ క‌బ్జాల‌కు పాల్ప‌డుతోంద‌ని రేవంత్ ఆరోపిస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ధ‌ర‌ణి ని ర‌ద్దు చేస్తామ‌న్నారు. సిసిఎల్ ఏ ప‌ట్టాదార్లు వివ‌రాల న‌మోదులో త‌ప్పిదాలు  ధ‌ర‌ణిలో స‌రిచేయ‌డానికి వీలు లేక‌పోయింది. రెవిన్యూ సిబ్బంది పొర పాట్ల వ‌ల్ల ఆధారాలు  మీసేవ  ద్వారా స‌మ‌ర్పించిన త‌ర్వాత జిల్లా క‌లెక్ట‌ర్‌ని సంప్ర దించాల్సి వ‌స్తోంది. ధ‌ర‌ణి అంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితులున్నాయి. 

కేసీఆర్ ప్ర‌భుత్వం హ‌రిత‌హారం పేరు మీద గిరిజ‌నుల భూమిని లాక్కుంటున్నార‌ని, భూ నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం కూడా ఇవ్వ‌కుండా అరెస్టు చేయించ‌డం జ‌రుగుతోంది. రాష్ట్రంలోకి  స‌రికొత్త భారీ వ్యాపార‌, ఫ్యాక్ట‌రీల‌ను ఆహ్వానించ‌డంలో టిఆర్ ఎస్ పేరును బాగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీ అందుకు కావ‌ల‌సిన మౌలిక స‌దుపాయాలు, భూముల ఏర్పాటుకు మాత్రం గిరిజ‌న భూముల‌ను, వీల‌యినంత త‌క్కువ ధ‌ర‌కు అందిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు విన‌ప‌డుతున్నాయి.

ఐకియా కంపెనీకి 19 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టారు. ఎకరా రూ. 50కోట్లు పలికే 15 ఎకరా ల భూమిని ఎలాంటి టెండర్లు లేకుండానే ఐకియాకు కట్టబెట్టారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు జాగా లేదం టున్న కేటీఆర్‌.. ఐకియాకు ఇచ్చిన భూమిలో వాటిన నిర్మించొచ్చు కదా అన్న అభిప్రాయాలు వ్య‌క్త అవు తున్నాయి. ఇప్పటికే  కేసీఆర్‌ కుటుంబం రూ. లక్ష కోట్లు దోచుకుంద‌ని  ధరణి  పోర్టల్‌కు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది.                                                               

ధరణి పోర్టల్‌ భూ సమస్యలకు సంబంధించి లక్షకు పైగా ప్రభుత్వానికి  ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భూము ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారుణాలు చేస్తోందని విప‌క్షాలూ ధ్వజమెత్తాయి. భూ యజమానులను కేసీ ఆర్‌ సర్కార్‌ జైల్లో పెట్టించ‌డం మ‌రీ దారుణం. తెలంగాణ లో భూ సమస్యలు పెరిగిపోయాయి  ధరణి వచ్చాక ప్రజలు  మ‌రీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణిలో వారసత్వ భూములు గల్లంతయ్యాయ నే అభియోగాలున్నాయి.  ఓటేసిన పాపానికి ప్రభుత్వమే తమ భూములను.. కొల్లగొడుతోందని బాధితులు రోదిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌, ప్రాజెక్టులు, ఫార్మాసిటీలు, ట్రిపుల్‌ ఆర్‌ పేరుతో కొల్లగొడుతున్నారని  విప‌క్షాల వారు దుయ్య బట్టారు.  రైతులు కన్న బిడ్డల్లా చూసుకునే భూములను కేసీఆర్‌ సర్కారు  అన్యాయంగా గుంజుకుంటోందని ఆరోప‌ణ‌లు స‌ర్వ‌త్రా విన‌ప‌డుతున్నాయి. 

పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను సైతం వివిధ కారణాలు చెప్పి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని మండిపడ్డారు. తరతరాలుగా వస్తున్న భూముల్ని సర్కారే స్వయంగా లాక్కోవడం సిగ్గుచేటనాలి.   ధరణి అద్భుతమని, సర్వరోగ నివారిణి అని కేసీఆర్‌ చెప్పిన మాటల్నీ అబద్దాలని ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. ధరణి రికార్డుల్లో అసలు యజమాని పేరు కాకుండా ఎవరెవరి పేర్లు ఉంటున్నాయని, లేదంటే సర్కారు భూమి అని చూపిస్తోందని ప్ర‌జ‌లు వాపోతున్నారు. 

పేదలు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్‌ 25లక్షల ఎకరాల భూములు పంచితే.. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 30 లక్షల ఎకరాలు మాయమయ్యాయని విప‌క్షాలు ఆరోపించాయి. ముఖ్యమంత్రి తీరుతో 5 లక్షల ఎకరాల పోడు భూములు కూడా ఆగమవుతున్నాయు. గౌరెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే చెల్లింది.