TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ధరణి పోర్టల్ అక్రమాలపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ ఏర్పాటు..!

Published on: Sun Jul 26, 2026 8:27AM

 

ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలు, సాంకేతిక లోపాలు, ప్రభుత్వానికి జరిగిన రెవెన్యూ నష్టంపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీఐడీ చీఫ్ చారు సిన్హా నేతృత్వం లో ఏడుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఎంక్వయిరీ టీం (SET)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పన, టెండర్ ప్రక్రియ, వెండర్ ఎంపిక నుంచి పోర్టల్ అమలు వరకు జరిగిన అన్ని అంశా లను ప్రత్యేక బృందం పరిశీలించనుంది. టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా, వెండర్ ఎంపికలో ఏవైనా అక్ర మాలు జరిగాయా, విదేశీ సంస్థలు లేదా ఇతర సంస్థల ప్రమేయం ఉందా అనే అంశాలపై కూడా దర్యాప్తు చేపట్టనుంది.

పోర్టల్ డిజైన్, సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లో ఉన్న లోపాలు, డేటా భద్రత, గోప్యత ఉల్లంఘనలు, అనధికార వ్యక్తులు లావాదేవీలు నిర్వహించే అవకాశం ఎలా ఏర్పడిందనే విషయాలను విచా రించనుంది. అధికార అనుమతి లేకుండానే లావాదేవీలు జరిగాయా, పేమెంట్ గేట్‌వే తనిఖీలను దాటవేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు వసూలు చేయకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయా, వాటి వల్ల ప్రభుత్వ ఖజా నాకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే అంశాలను కూడా పరిశీలించనుంది.

అంతేకాకుండా, కార్యాలయ పని వేళలకు వెలుపల జరిగిన అనుమానాస్పద లావాదేవీలు, సిస్టమ్ లాగ్‌లు అందు బాటులో లేకపోవడం, దరఖాస్తుదారుల ఐపీ అడ్రస్‌లు నమోదు కాకపోవడం, అప్లికేషన్ ట్రాన్సాక్షన్ ఐడీలను ఆధార్ లావాదేవీ ఐడీలతో సరిపోల్చడంలో ఉన్న లోపాలు వంటి అంశాలపై సాంకేతికంగా విచారణ జరపనుంది. అక్రమాలకు బాధ్యులైన అధికారులు, సంస్థలు లేదా ఇతర వ్యక్తుల బాధ్యతను నిర్ధా రించి, అవసరమైతే కేసు లను ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు బదిలీ చేయా లని ప్రభుత్వం ఆదేశించింది. 

రెవెన్యూ శాఖ ఈ ప్రత్యేక విచారణ బృందా నికి అవసరమైన సాంకే తిక, పరిపాలనా, ఆర్థిక సహాయాన్ని అందించ నుండగా, ప్రభుత్వంలోని అన్ని శాఖలు, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (TGTS)తో పాటు సంబం ధిత అధికారులు పూర్తి సహకారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే ఫోరెన్సిక్, సాంకేతిక నిపుణుల సేవలను కూడా SET వినియోగించుకోనుంది. విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభు త్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని, డేటా భద్రత వంటి అత్యవసర అంశాలపై మధ్యంతర నివేదికలను కూడా సమర్పించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.