TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఇద్దరు తల్లిదండ్రుల కేసులో ధనుష్‌కి ఊరట

Published on: Fri Mar 3, 2017 10:46AM

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కి మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మధురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకే అంటూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం స్కూల్ సర్టిఫికేట్లను తమకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు స్కూల్ సర్టిఫికేట్లను సమర్పించారు.

 

అయితే కదిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టుమచ్చలు పేర్కొన్నట్లు ఉండటం..ధనుష్ తరపు న్యాయవాది సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేకపోవడంతో..పుట్టమచ్చల వెరిఫికేషన్‌కు న్యాయస్థానం ముందు హాజరుకావాలని మధురై కోర్టు ధనుష్‌ని ఆదేశించింది. దీంతో ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తుదితీర్పును ఈ నెల 9కి వాయిదా వేసి..ప్రస్తుతానికి స్టే విధించింది. అయితే కదిరేషన్ దంపతులు ధనుష్‌కి డీఎన్ఏ పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు..అందుకు న్యాయస్థానం ఎలాంటి ఆదేశాన్ని జారీ చేయలేదు.