హాలీవుడ్ లో అడుగుపెడుతున్న ధనుష్..
Published on: Mon Jan 25, 2016 4:52PM

భారత దేశంలో పెద్దదైన సినీ పరిశ్రమ బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికే చాలా మంది నటీ నటులు కష్టపడుతుంటారు. అలాంటిది అక్కడ ఈజీగా అరంగేట్రం చేసి ఇప్పుడు ఎంతో మంది కలలు కనే హాలీవుడ్ లోకి కూడా అడుగు పెడుతున్నాడు ఓ కుర్ర హీరో.. అతను ఎవరో కాదు రజనీకాంత్ అల్లుడు, తమిళనాట టాలెంటెడ్ నటుడు ధనుష్. ధనుష్ కు ఈ అరుదైన అవకాశం దక్కింది. త్వరలో ధనుష్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు. "ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్" అనే సినిమాలో హాలీవుడ్ హీరోయిన్లు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో ధనుష్ జతకట్టనున్నాడు.
ఈ సందర్బంగా ఈ చిత్ర డైరెక్టర్ మర్జానే సత్రపి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో కోసం తాను ఎన్నో ఇండియన్ సినిమాలు చూశానని.. అప్పుడే ధనుష్ ని చూశానని.. ధనుష్ అయితే తాను అనుకున్న పాత్రకి సరిగ్గా సరిపోతాడనిపించిందని చెప్పాడు. ఈ సినిమాలో ప్రేమ, సాహసం, అద్భుతాలు కలగలిపి ఉంటాయని తెలిపారు.


