థానే తుఫాను..40 మంది మృతి!
Published on: Sat Dec 31, 2011 12:21PM
హైద
రాబాద్: థానే తుఫాను తమిళనాడుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భారీగా ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో అపార నష్టం వాటిల్లగా, పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అలాగే, ఈ రెండు రాష్ట్రాల్లో థానే తుఫాను ప్రభావానికి 40 మంది మృత్యువాత పడ్డారు.తుఫాను సహాయ పనుల కోసం తక్షణ సాయంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 150 కోట్ల రూపాయలను కేటాయించారు. అందేవిధంగా తుఫాను పాధిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి సహాయ చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాగా, కావేరి డెల్టా ప్రాంతంలో 25 వేల ఎకరాల్లో వరి పంటకు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. కడలూరు జిల్లాలో మాత్రం కోట్లాది రూపాయల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.


