బైకుపై ఉగ్రవాది కాల్చివేత...
Published on: Sat Mar 18, 2017 1:00PM

బంగ్లాదేశ్ లో ఓ ఉగ్రవాదిని కాల్చి చంపారు పోలీసులు. వివరాల ప్రకారం... బంగ్లాదేశ్ లోని నగరంలోని కిల్‌గావ్ ప్రాంతంలో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్(ఆర్‌ఏబీ) యూనిట్ వద్దకు తెల్లవారుజామున ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై దూసుకొచ్చాడు. చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది ఆదేశాలను లెక్కచేయకుండా దూసుకొచ్చిన అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఉన్నటువంటి బ్యాగులో పేలుడు పదార్ధాలు గుర్తించామని ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్(డీఎమ్‌పీ) అధికారులు వెల్లడించారు.


