కన్ఫ్యూజన్ లో విమానాన్ని కూల్చేసిన పైలెట్...

 

మామూలుగా విమానాలు ఏదో సాంకేతిక లోపం వల్ల కూలిపోతుంటాయి. లేదా వేరే ఇతర కారణాల వల్ల కూలిపోవడం చూస్తుంటా. కానీ ఇక్కడ ఓ పైలెట్ కన్ఫ్యూజన్ లో విమానాన్ని కూల్చేశాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం నేపాల్ రాజధాని కాట్మండూలోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఢాకా నుంచి కాట్మాండుకు 67 మందితో వెళుతున్న విమానం కుప్పకూలిన ప్రమాదంలో 50 మంది మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే ప్రమాదం జరగడానికి సాంకేతిక పరమైన లోపం ఏం లేదని.. విచారణ బృందం తేల్చింది. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో పైలెట్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు మధ్య ఏర్పడిన కన్ఫ్యూజనే కారణమని చెప్పారు. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో విమానం పైలెట్ 'తాము దిగొచ్చా?' అని ప్రశ్నించాడని, అప్పటికే ఆలస్యం అయిందని తెలుసుకున్న కంట్రోలర్ వణుకుతున్న స్వరంతో 'వెనక్కు వెళ్లిపో' అని చెప్పినట్టు రికార్డ్ అయిందని, దాన్ని పట్టించుకోని పైలట్ ల్యాండింగ్ చేస్తుండగానే, ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది ఫైర్‌ సిబ్బందిని వేగంగా రన్ వేవైపు వెళ్లాలని ఆదేశించాడని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని, కొద్దిమంది ప్రాణాలను మాత్రమే కాపాడగలిగామని తెలిపింది.